20-09-2025 12:00:00 AM
పటాన్‌చెరు, సెప్టెంబర్ 19 : గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, సుస్థిరత, ఆవిష్కరణ, పచ్చని భవిష్యత్తును రూపొందించడంలో వాస్తుశిల్పం పాత్రను గుర్తు చేసుకోవడంలో భాగంగా ‘ప్రపంచ గ్రీన్ బిల్డింగ్ వారోత్సవం-2025’ను నిర్వహించారు.
తొలిరోజు బీఆర్క్ రెండో ఏడాది విద్యార్థులు హైటెక్ సిటీలోని సీఐఐ-ఐజీబీసీ ప్రాంగణాన్ని సందర్శించి, ఇంధన-సమర్థవంతమైన వ్యవస్థలు, పర్యావరణ అనుకూల ప్రణాళికతో సహా స్థిరమైన డిజైన్ యొక్క అనుభవజ్జులైన ప్రత్యక్ష ఉదాహరణలను తెలుసుకున్నారు.
రెండో రోజు, గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ఆలోచింపజేసే వెబినార్ నిర్వహించింది. స్థిరత్వం యొక్క ఆర్థిక కోణాలను, పర్యావరణ హిత ఆలోచనలను ఆచరణీయ ప్రాజెక్టులుగా మార్చడానికి స్మార్ట్ పెట్టుబడుల సామర్థ్యాన్ని ఇందులో ప్రముఖంగా ప్రస్తావించారు.
మూడవ రోజు గీతం ప్రాంగణంలోని వ్యర్థాలను అద్భుతమైన డిజైన్ నమూనాలుగా పునర్నిర్మించడంలో విద్యార్థుల సృజనాత్మకతకు ప్రధాన వేదికగా మారింది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ స్నేహ ఎస్.రెడ్డిసమన్వయంచేశారు.
మోర్గి విద్యార్థులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
నాగల్‌గిద్ద, సెప్టెంబర్ 19 : నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్ గిద్ద మండలం మోర్గి మోడల్ హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వారు పడుతున్న ఇబ్బందులను నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పరిశీలించారు.
మోడల్ హాస్టల్ విద్యార్థుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని ఈ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల నుండి మోడల్ పాఠశాల, కళాశాల హాస్టల్లో సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఇటీవల కాలంలో ఫుడ్ పాయిజన్ కాగా ఇప్పుడు వారికి నీరు, తాగు నీరు సమస్య ఉందని తెలుసుకొని వారితో మాట్లాడారు.
మాజీ ఎమ్మెల్యే వెంట కల్హేర్ మాజీ జడ్పిటిసి నరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పండరి, మాజీ ఎంపీటీసీ నందు పటేల్, నాయకులు భీమన్న, సూర్య ప్రకాష్ రెడ్డి, పున్లిక్,శాంతప్ప తదితరులు ఉన్నారు.
సబ్ కలెక్టర్ సందర్శన...
నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి మోర్గి మోడల్ స్కూల్ వసతి గృహాన్ని సందర్శించారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల్లో వారి సమస్యలను పరిష్కరిస్తామని, ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
వారితో పాటు మండల ఎంపీడీవో మహేశ్వర రావు, తహసిల్దార్ శివకృష్ణ, మండల విద్యాధికారి మన్మధ కిషోర్, మండల అధికారులు, హాస్టల్ వార్డెన్ రాజేశ్వరి, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సువర్ణ ఉన్నారు.