14-07-2025 12:21:51 AM
ఆమనగల్లు, జులై 13: ఆమనగల్లు బ్లాక్ మండల కేంద్రం లో గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ నాగర్కర్నూలు ఎంపీ మల్లు రవికి ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కేశవులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆమనగల్ మండలం కేంద్రంలో ఎస్ టి ఓ, సబ్ రిజిస్టార్ కార్యాలయాలు అందుబాటు లేక నాలుగు మండలాలకు చెందిన ప్రజలు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆయన ఎంపీ కి వివరించారు.
ప్రతినిత్యం వివిధ పనుల నిమిత్తం ఆమనగల్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహేశ్వరం మండల కేంద్రానికి ఆమనగల్, మాడుగుల, తలకొండపల్లి,కడ్తాల నుంచి పనుల నిమిత్తం వెళ్లి ఇబ్బందులు పడుతున్నారట్టు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దీనికి స్పందించిన మల్లురవి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పోగులేటి శ్రీనివాస్ రెడ్డి ల దృష్టి కి తుసుకెళ్లి కార్యాల ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని ఆయన హామీనిచ్చారు. కార్యక్రమంలో ప్రజా గాయకుడు వేపూరి సోమన్న, మండల నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నరసింహ, కంబాలపల్లి వీరయ్య, విష్ణువర్ధన్, పట్నం శివరాజు లు పాల్గొన్నారు.