calender_icon.png 1 August, 2025 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ వేతనాలు చెల్లించాలని వినతి

31-07-2025 11:36:41 PM

మంచిర్యాల: బీసీ హాస్టల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని బీసీ వెల్ఫేర్ డిడి పురుషోత్తం నాయక్ కు సిఐటియు నాయకులు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ లో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్, ఎంపీడబ్ల్యు ద్వారా సుమారు  36 మంది వర్కర్స్ పనులు చేస్తున్నారని, 2024 నవంబర్ నుంచి 2025 జూలై నెల వరకు (8 నెలల) వేతనాలు రాలేదన్నారు. ప్రతినెల వేతనాలు రాకపోవడంతో ఇంటి అద్దెలకు, పిల్లల చదువులకు, రోజువారి ఖర్చులకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, హాస్టళ్లలో వర్కర్లు సరిపడా మంది లేకపోవడంతో ఉన్న వర్కర్ల పైననే పని ఒత్తిడి, అధిక పని భారం పడుతుందన్నారు. కార్మికులందరికీ  యూనిఫామ్, ఐడి కార్డులు, ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలని, ఏజెన్సీ లను రద్దుచేసి ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.