01-08-2025 12:00:00 AM
గ్రామాల్లోనే బస... రోజుకు ఐదు నుంచి పది ఎకరాల్లో నాట్లు
బూర్గంపాడు, జూలై 31 (విజయక్రాంతి): ఒకప్పుడు గ్రామాల్లో వరినాట్లు మొదలయ్యాయంటే సందడి నెలకొనేది. ముఖ్యంగా మహిళలు వేరే పనికి వెళ్లకుండా నాట్లపైనే దృష్టి పెట్టేవారు. ఇప్పుడు అందుకు భిన్నమైన వాతావరణం పల్లెల్లో చోటు చేసుకుంది. వరి నాట్లు వేసేందుకు కూలీలు దొరకక రై తులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
దీంతో రైతులు వలస కూలీలు, యాంత్రాలపైనే ఆధారపడుతున్నారు. యం త్రాల కొరత, యంత్రాలు కొన్ని భూముల్లో నాట్లు వేసే పరిస్థి తి లేక పోవడంతో మనుషులతో నాట్లు వేయిస్తే పంట ఎక్కువగా వస్తుందని రైతులు కూలీల కోసం ఎదురు చూస్తున్నారు.
గత మూడేండ్లుగా వలస కూలీలు రాక..
వెస్ట్ బెంగాల్ కూలీలు గత మూడేండ్లుగా మన ప్రాంతాలకు వచ్చి ఉపాధి పొందుతుంటారు. ఖరీఫ్, రబీ రెండునె లలు మన ప్రాంతంలోనే కూలీలు ఉంటూ నాట్లు వేసుకుని ఉపాధి పొంది ఆ సొమ్ములతో వారి ప్రాంతాల్లో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ ఆరం భం కాగానే వెస్ట్ బెంగాల్ కూలీలు వలస వచ్చారు. ముం దుగా బోరు,చెరువు నీరు ఆధారిత ప్రాంతాల్లో నాట్లు వేస్తూ ఖరీప్ పంట సాగు ప్రారంభించారు.
వెస్ట్ బెంగాల్ కూలీలు ఈ ఖరీఫ్ సీజన్ చేసుకోవడానికి ఈ ప్రాంతానికి వచ్చారు. ఇ ప్పటికే ఖరీఫ్ నాట్లు వేయడం ప్రారంభించారు. ఎకరానికి రూ.5వేలు ఇస్తే నారు పీకి నాట్లు వేసి వెళ్లిపోవడంతో రైతుల కు పొలంలో దిగే పని లేకుండా పని చకచకా చక్కపెట్టేస్తున్నారు. దీంతో రెండు నెలల నుంచి మన ప్రాంత రైతులంతా కూడా ఆ కూలీలకు ఇచ్చేస్తున్నారు. అలాగే మన ప్రాంత కూలీలకు వాళ్లకి రూ.2వేలు వ్యవసాయ పెట్టుబడి కలిసివస్తుందని పలువురు చెబుతున్నారు.
వెస్ట్ బెంగాల్ కూలీలు వేసే నాట్లు వల్ల దిగుబడులు కూలీ బాగా కలిసి వస్తున్నాయని రైతులు చెబుతున్నారు.వలస కూలీల రాకతో మన ప్రాంత కూలీలకు ఉపాధి తగ్గిందని పలువురు చెబుతున్నారు. కొంత మంది స్థానికులు ఆయా ప్రాంతాలకు చెందిన వలస కార్మికులను గ్రామాలకు తీసుకువచ్చి వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు.
వా రితో ఎకరాకు ఒక ధరను ఒప్పందం చేసుకొని రైతుల నుంచి ఎక్కవ తీసుకొని వరి నాట్లు వేయిస్తున్నారు.మా ప్రాంతంలో ఉపాధి లేక ఖరీఫ్,రబీ సీజన్లో ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటున్నామని ఈ ప్రాంతవాసులు తమను ఎంత గానో ఆదరిస్తున్నారని వలస కూలీలు చెబుతున్నారు.