26-11-2025 07:22:24 PM
కుంటాల (విజయక్రాంతి): కుంటాల మండలంలో మార్క్ఫెడ్ ఆదరణ కొనుగోలు చేసిన సోయపంట నాణ్యత విషయంలో ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొచ్చి రైతులకు న్యాయం చేస్తానని మార్క్ఫెడ్ జిల్లా అధికారి మహేష్ అన్నారు. బుధవారం కుంటాల మండల కేంద్రంలో రైతు దత్తు ఆధ్వర్యంలో నిరసన చేపడుతున్న కార్యక్రమాన్ని సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాపస్ పంపిన సోయలను తిరిగి గోదాములకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రైతులు ఆందోళన చెందవద్దని ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. అనంతరం పిఎసిస్ కార్యాలయం ఎదుట ఉన్న సోదరులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.