27-04-2025 12:13:05 AM
వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్‌కు ఎన్‌పీఆర్‌డీ ప్రతినిధి బృందం వినతి పత్రం
మలక్‌పేట్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసంలో పథకలలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి 5శాతం రిజర్వేషన్ అమలు చేయాలని *వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్, ప్రధాన కార్యదర్శి యం అడివయ్య, కోశాధికారి ఆర్ వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జె రాజు,రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ భుజంగా రెడ్డి లతో కూడిన ప్రతినిధి బృందం ఈ రోజు వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ బి శైలజ గారికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం పేదల ఇంటి నిర్మాణం కోసం 5లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి, స్వంత ఇళ్ళు లేని నిరుపేదలకు ఆవాసం కల్పించెందుకు 2025 జనవరి 26 న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. పథకం ప్రారంభం సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇందిరమ్మ ఇండ్లలో వికలాంగులకె మొదటి ప్రాధాన్యత ఉంటుందని ప్రకటించారన్నారు.
2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాల్లో వికలాంగుకు 5శాతం రిజర్వేషన్స్ అమలు చేయడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే సాధారణ లబ్ధిలో 25 శాతం ఇవ్వాలన్నారు. కానీ ఇందిరమ్మ ఇండ్లలో 2016 ఆర్పిడి చట్టం కు భిన్నంగా అధికారులు వ్యవహారిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసంలో వికలాంగులకు 5శాతం రిజర్వేషన్స్ అమలు చేయిస్తామని వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ బి శైలజ హామీ ఇచ్చారు. వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నా మని, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసంలో 5శాతం రిజర్వేషన్స్ అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసి కఠినంగా అమలు చేస్తామని తెలిపారు.