16-09-2025 11:17:39 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): బాన్సువాడ మండలం బోర్లం క్యాంపు గ్రామంలో శ్రీ ఆది బసవేశ్వర ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు మంగళవారం విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బోర్లం గ్రామానికి చెందిన పర్వా రెడ్డి, రాజేశ్వర్ గౌడ్, అన్నం హనుమాన్లు, కాంట సాయిరెడ్డి, గోవింద్ రెడ్డిలు ప్రతి ఒక్కరూ తమ వంతుగా 5 వేల రూపాయలు విరాళంగా అందించారు. ఈ ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు తమ సహకారాన్ని అందిస్తున్నారు.