calender_icon.png 17 September, 2025 | 1:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీకు దమ్ముంటే శ్రీపాద రావు విగ్రహాన్ని తాకి చూడు పుట్ట

16-09-2025 11:21:55 PM

మంథని,(విజయక్రాంతి): నీకు దమ్ముంటే  శ్రీపాద రావు విగ్రహాన్ని తాకి చూడు పుట్ట మధు అని మంథని కాంగ్రెస్ నాయకులు మంథని పట్టణంలో పుట్ట మధు ఇంటి ముందు మంగళవారం  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు. అనంతరం పుట్ట మధు ఇంటి నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు పుట్ట మధుకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వేళ్లి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్  విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి, శ్రీపాదరావు విగ్రహానికి కూడా పాలాభిషేకం చేశారు. 

ఈ సందర్భంగా మంథని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఐలి ప్రసాద్, మంథని మాజీ సర్పంచ్ వోడ్నాల శ్రీనివాస్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, మాజీ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, మాజీ ఎంపీపీ కొండ శంకర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ ఆరెల్లి కిరణ్ లు  మాట్లాడుతూ కమాన్ పూర్ మండలంలోని పెంచికలపేటలో డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో పుట్ట మధు మాజీ స్పీకర్ శ్రీపాదరావు విగ్రహాలు మంథనిలో కూల్చివేస్తానని అనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  

 స్వర్గీయ శ్రీపాద రావు  పుట్టమధుకు రాజకీయ బిక్ష పెట్టారని, శ్రీపాద రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతినిధిగా ఆ పదవికి వన్నె తెచ్చి దేశంలోనే ఒక గొప్ప స్పీకర్ గా వెలుగొందారని, మంథని నియోజకవర్గ ప్రజలు శ్రీపాద రావు ను  మూడుసార్లు.  శ్రీధర్ బాబు ను ఐదు సార్లు ఎమ్మెల్యేగా మంథని ప్రజలు గెలిపించారని,  రాబోయే రోజుల్లో మంథని ప్రాంతంలో శ్రీపాదరావు విగ్రహాలు కులుచుతామని పుట్ట మధు మాట్లాడడం సిగ్గుచేటని, నీకు దమ్ముంటే ఒకసారి శ్రీపాద రావు విగ్రహాన్ని తాకి చూడని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్ల మీకు వారి సత్తా చూపిస్తారన్నారు.  నీ ఇంటి  ముందు ఈ రోజు నిరసన మాత్రామే చేశామని,  రాబోయే రోజులలో నిన్ను రోడ్డుమీద తిరగకుండా తరిమికొడతమని  హెచ్చరించారు.

మాజీ స్పీకర్ శ్రీపాద రావు, మంత్రి శ్రీధర్ బాబు మోచేతి నీళ్లు తాగి ఇవాళ దుద్దిళ్ల కుటుంబం పైనే ఆరోపణలు చేస్తావా...గతంలో నువ్వు జడ్పిటిసిగా గెలిచినప్పుడు నా దైవ సమానులు అయినటువంటి శ్రీపాద రావు మీద ప్రమాణం చేసి నువ్వు ప్రమాణ స్వీకారం చేయలేదా అని ప్రశ్నించారు. ఓడ దాటేటప్పుడు ఓడ మల్లన్న ఓడ దాటంగానే బోడ మల్లన్న అన్నట్టుగా నీ వ్యవహారం ఉందని, గతంలో కవిత  నీకు టికెట్ ఇప్పిచ్చినప్పుడు నా సొంత అక్క అన్న నువ్వు, ఇప్పుడు బీర్ఎస్ పార్టీ నుండి కవిత ను బహిష్కరించాంగనే ఆమె పైన కూడా విమర్శలు చేసిన నీ నీచబుద్ది, నీ కపట ప్రేమ  ప్రజలందరికీ తెలిసిందని విమర్శించారు.  

లాయర్ వామనరావు దంపతుల హత్య కేసులో సిబి సిబిఐకి విచారణ జరుగుతోందని, దీంతో తన భాగోతం బయటపడుతుందనే భయంతో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నడని, సిబిఐ త్వరలోనే విచారణ జరిపి నిన్ను కటకటాలకు పంపిస్తుందని, మరోసారి  శ్రీపాద రావు పైన, శ్రీధర్ బాబు, శ్రీనుబాబు పైన అనుచిత వాక్యాలు చేస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. నిన్ను మంథని ప్రజలు మర్చిపోవడం తో  నీకు పిచ్చి పట్టిన విధంగా నీ ప్రవర్తన పిట్టలదొర, జోకర్ లాగా ఉందన్నారు.