16-09-2025 11:12:57 PM
రామకృష్ణాపూర్,(విజయాక్రాంతి): క్యాతనపల్లి పురపాలకం రామకృష్ణాపూర్ పట్టణంలో కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మంగళవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పుర అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై నిర్వహించే సమీక్షకు తహశీల్దార్ సతీష్, పుర కమిషనర్ రాజు, ఏఈ, విద్యుత్ శాఖ అధికారులు హాజరయ్యారు. ఆయా శాఖలలో పెండింగ్లో ఉన్న పనుల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమైన పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మంత్రి పట్టణ సమస్యల గుర్చి కార్యకర్తలను అడుగగా వార్డుల వారిగా కాలనీల్లో ఉన్న సమస్యలను వ్రాసి అందజేశారు.