25-11-2025 07:54:44 PM
46 జీవోను రద్దు చేయాలని నార్కట్ పల్లిలో మహా ర్యాలీ
బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎలక్షన్లకు పోతే యుద్ధమే
బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్
చిట్యాల,(విజయక్రాంతి): స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, 46 జీవోను రద్దు చేయాలని నార్కట్ పల్లి బస్టాండ్ నుండి నల్గొండ చౌరస్తా వరకు విద్యార్థులు నాయకులతో మహార్యాలీగా వచ్చి మంగళవారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా లో బిజెపి రాష్ట్ర నాయకుడు ఓరుగంటి వంశీ, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్, ఎడ్ల మహాలింగం, కర్నాటి యాదగిరిపాల్గొన్నారు.
వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానంలో ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని, అది కాకుండా ఎలక్షన్లకు పోతే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసి పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని హెచ్చరించారు. 79 ఏళ్ల స్వతంత్ర తెలంగాణలో బీసీలకు ఈ రాష్ట్రంలో స్వతంత్రం రాలేదని, ఇంతవరకు ముఖ్యమంత్రిలు కాలేదని, సరైన స్థానంలో ఎమ్మెల్యేలు, మంత్రులు కాలేదని అన్నారు. ఇప్పుడు సర్పంచులు అయితే గిట్ల ఓరుస్తలేదంటే ఈ రాజ్యం అడవిక రాజ్యం అని, రాజ్యంగబద్దంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని, ప్రభుత్వం ఇచ్చిన 46 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పార్టీలపరంగా రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని, రెండు రోజులలో ఎన్నికలు జరిపే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించిందని ఇలాంటి సందర్భంలో ఎట్టి పరిస్థితిలో చట్టబద్దంగానే ఎన్నికలు జరపాలని కోరారు. జనాభా ప్రకారం విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లతో పాటు స్థానిక సంస్థల రిజర్వేషన్లను కల్పించే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడానికి రాజ్యాంగ సవరణ జరగాలని, బీసీ సంఘం, అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు.
ఉద్యమాన్ని ఉదృతం చేయాలని పిలుపు నిస్తూ, స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్ల సాధనకై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉదృతం చేయాలని జిల్లా, పట్టణ, మండల కేంద్రాల్లో నిరాహార దీక్షలు, ధర్నాలు చేపట్టాలన పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుంటే ఎలక్షన్లకు పోతే బీసీ చైర్మన్ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చి పెద్ద ఎత్తున నిరసన చేసి ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తాం అని అన్నారు. ఈ ర్యాలీలో నరేందర్ రెడ్డి, దాసరి కృష్ణ, ఉపేందర్, మణికంఠ భాస్కర్ ఉషశ్రీ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.