calender_icon.png 25 November, 2025 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోగిన "పంచాయతీ" ఎన్నికల నగారా

25-11-2025 07:52:21 PM

వలిగొండ (విజయక్రాంతి): తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో పంచాయతీ ఎన్నికలకు తెరలేసింది. వలిగొండ మండలంలో మొత్తం ఓటర్లు 52,346 మంది ఉండగా, 37 గ్రామపంచాయతీలకు, 330 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న వలిగొండ మండలం పంచాయతీ ఎన్నికలలో అన్ని స్థానాలను హస్తగతం చేసుకున్నందుకు ఆతృతగా ఎదురుచూస్తుంది. కాగా పంచాయతీ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని బీఆర్ఎస్ పార్టీ వ్యూహలను రచిస్తూ కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులను తమ వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది.