25-11-2025 07:57:19 PM
మాజీ మున్సిపల్ చైర్మన్ మడత రమ ఆధ్వర్యంలో మహాఅన్నదాన కార్యక్రమం
ఇల్లెందు,(విజయక్రాంతి): ఇల్లందు పట్టణంలోని ఎనిమిదో వార్డు నందుగల శ్రీ సీతారామ ఆలయంలో సీతారామ లక్ష్మణ హనుమాన్ విగ్రహాల ప్రతిష్టాపన, గణపతి, దుర్గ మాత, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నందీశ్వర స్వామి విగ్రహాలను వేద పండితుల సమక్షంలో మంగళవారం ప్రతిష్టించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇల్లందు మాజీ మున్సిపల్ చైర్మన్ మడత రమా-వెంకట్ గౌడ్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య సతీమణి లక్ష్మీ, డిఎస్పి చంద్రబాను దంపతులు, మడతరమ వెంకట్ గౌడ్ దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అన్నదానo లో ఇల్లందు మండలం, పట్టణంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏక్తా హౌస్ టీం సభ్యులు మామిడి శివ, కోటగిరి రాజు, మెరుగు భరత్, కంది సదానందం, మునాఫ్, రేఖ రవిశంకర్, స్వామి నాయక్, విక్కీ,గోపి తదితరులు పాల్గొన్నారు.