03-01-2026 12:29:41 AM
జవహర్‌నగర్, జనవరి 2 (విజయక్రాం తి) : జిల్లాస్థాయి సబ్ జూనియర్ అథ్లెటి క్స్ పోటీలను ఈ నెల 4న నిర్వహిస్తున్నామని మేడ్చల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కూరపాటి రాజశేఖర్ శుక్ర వారం ఒక ప్రకటనలో తెలిపారు.
చర్లపల్లిలోని క్రీడా మైదానంలో 8, 10, 12, 14, 20 ఏండ్లలోపు బాలబాలికలను పరుగుపందెం, జంపింగ్, త్రోయింగ్ అంశాల్లో పోటీలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. అత్యంత ప్రతిభ కనబర్చిన వారు ఈ నెల 18న ఆదిలాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. పూర్తి వివరాలకు 9849612788 సంప్రదించాలని కోరారు.