16-12-2024 01:27:58 AM
బాధితుడు శ్రీతేజ్‌ను పరామర్శించిన మందకృష్ణ, నేరెళ్ల శారద
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 15 (విజయక్రాంతి): సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ హాస్పి టల్‌లో ట్రీట్‌మెంట్ పొందుతున్న బాలుడు శ్రీతేజను ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. ఆదివారం కిమ్స్ ఆసుపత్రికి వచ్చిన ఆయన బాలుడి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో మాట్లా డి.. శ్రీతేజ్‌కు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ ఘటన బాధా కరమని, ప్రాణపాయ స్థితిలో ఉన్న బాలుడిని పరామర్శించేందుకు ఇప్పటి వరకు సినీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు రాకపోవడం శోఛనీయమని అన్నారు. అల్లు అర్జున్.. బాధిత కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారంతో పాటు శ్రీతేజ, అతడి సోదరి చదువుకయ్యే ఖర్చులు భరించలన్నారు.
భద్రత కల్పించడంలో విఫలమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ‘మా’ అసోసియేషన్‌తో పాటు సినీ ప్రముఖులు అండగా నిలవాలని కోరారు. అనంతరం మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద బాలుడిని పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు.