calender_icon.png 20 December, 2025 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్ పదవికి ఎసరు!

20-12-2025 01:34:22 AM

  1. సీఎం కుర్చీ లాగేందుకు కాంగ్రెస్‌లో 20 మంది ఎమ్మెల్యేలు వేరు కుంపటి 
  2. అందుకే రేవంత్‌రెడ్డి పదేళ్లు నేనే సీఎం అంటుండు 
  3. కాంగ్రెస్ పరిపాలన మూడు అబద్ధాలు.. ఆరు హామీలు 
  4. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత తేటతెల్లం 
  5. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

నిర్మల్ డిసెంబర్ 19 (విజయ క్రాంతి) : ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదవికి ఎసరు పెట్టేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి.. ఆయన కుర్చీ లాగేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన 20మంది ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టారు.. అందుకే రేవంత్‌రెడ్డి పదేళ్లు నేనే సీఎంగా ఉంటా అంటుండు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో విజయం సాధించిన సర్పంచ్, ఉప సర్పంచ్ ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం నిర్మల్ జిల్లాకేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఏర్పా టు చేశారు.

ఈ కార్యక్రమానికి ఎన్. రామచందర్‌రావు ముఖ్య అతిథిగా హాజరై విజేతలను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిపాలన ‘మూడు అబద్ధాలు.. ఆరు హామీ లు’ అనే రీతిలో సాగుతుందని రాంచందర్‌రావు విమర్శంచారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా తేటతెల్లమైందన్నారు.  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదన్నారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రజా ఆస్తులను అమ్ముకొ ని అక్రమాలకు తెరలేపుతోందని ఆరోపించారు. 

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటే..

పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు, సీట్లు పెరిగాయన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లు కుమ్మక్కై బీఆర్‌ఎస్ మద్దతుదారులను ఓడించేందుకు కుట్ర లు చేశాయని విమర్శించారు. రాష్ట్రంలో బీజే పీ అధికారంలో రాకుండా రెండు పార్టీలు తెరచాటు రాజకీయాలు నడిపిస్తున్నాయని ఆయన విమర్శించారు. 

రామ్ పేరు చేరిస్తే కార్యాలయాలు ముట్టడిస్తారా?

జాతిపిత మహాత్మాగాంధీ అంటే బీజేపీకి ఎంతో గౌరవమని రాంచందర్‌రావు చెప్పారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రామ్ పేరు చేరిస్తే కాంగ్రెస్ నేతలు బీజేపీ  కార్యాలయాలు ముట్టడించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.  ఉపాధి హామీ పథకంలో కొత్త సంస్కరణలు తీసుకొచ్చి గ్రామాల్లో రామ రాజ్యం స్థాపనగా పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేసే బాధ్యత ప్రధాని  మోదీ తీసుకున్నారన్నారు.   డబుల్ ఇంజన్ ప్రభుత్వాలతోనే దేశంలో రామరాజ్య స్థాపన సాధ్యమని ఎన్.రామచందర్‌రావు అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో మాత్రం వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడే విధంగా ప్రతి గ్రామం లో కాషాయ జెండా ఎగరవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజే పీ సీనియర్ నేత  మహేశ్వర్ రెడ్డి , ఎమ్మెల్యేలు రామారావు పటేల్ పాల్వాయి హరీష్‌బాబు, పాయల శంకర్, రామారావుపటేల్, జిల్లా పార్టీ రితేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.