calender_icon.png 20 December, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెప్పిందే రేటు.. ఇచ్చిందే బిల్లు!

20-12-2025 01:33:34 AM

  1. పేటలో మొబైల్ స్పేర్ పార్ట్స్ జీరో దందా
  2. కోట్లలో  సాగుతున్న వ్యాపారం...
  3. అమ్మకాల్లో రాజస్థానీల రాజసం
  4. రెండొందల దుకాణాలకు అమ్మేది వారే..

సూర్యాపేట, డిసెంబర్ 19 : మార్కెట్లో ఏ వస్తువులు కొనుగోలు చేసిన దానికి సంబంధించిన బిల్లును పొందడం అనేది వినియోగదారుడు యొక్క హక్కు. అదే పద్ధతి మొబైల్ స్పేర్ పారట్స్ కొనుగోలులోను ఉంటుంది. వ్యాపారస్థులు సైతం అమ్మిన వస్తు వులకు రషీదు ఇవ్వాలి. కానీ సూర్యాపేటలో కొంతమంది వ్యాపారులు వారు అమ్మిన వస్తువులకు ఎటువంటి బిల్లులు ఇవ్వడం లేదు.

ఇచ్చినా అవి కేవలం తెల్ల కాగితంపై వస్తువుల వివరాలు లేకుండా వాటి రేట్ ను మాత్రమే వేసి ఇవ్వడం ఆనవాయితీగా మారిపోయింది. అంతే కాకుండా నాణ్యతా లోపం ఉన్న వస్తువులను అమ్ముతూ జనాలను మోసం చేస్తున్నారు. వ్యాపారస్తులు ఏ వస్తువు అమ్మినా, కొన్నా చట్టపరంగా ప్రభుత్వానికి పన్ను రూపంలో డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొందరు వ్యాపారులు అక్రమ విధానాలను అనుసరిస్తూ ఆ డబ్బులు ఎగ్గొట్టి జీరో వ్యాపారం నిర్వహిస్తున్నారు. 

మొత్తానికి జోరుగా జీరో దందా..

జీరో దందాతో నాణ్యతలేని వస్తువులను అమ్ముతూ ఒక వైపు ప్రభుత్వాన్ని, మరోవైపు వినియోగదారులను మోసం చేస్తూ కోట్ల రూపాలను దోచుకుంటున్నారు. సూర్యాపేట పట్టణంలో సుమారు రెండొందలకు పైగా మొబైల్ షాప్లు ఉన్నాయి. వీటిలో దాదాపుగా అన్నిచోట్ల మొబైల్ రిపేరింగ్ కూడా చేస్తుంటారు. ఇన్ని షాప్లకు అవసరమైన మొబైల్ స్పేర్ పారట్స్ మాత్రం కేవలం నాలుగైదు షాప్ లలో మాత్రమే దొరుకుతాయి.

తప్పని పరిస్థితిలో వాటిలోనే కోనుగోలు చేయాల్సి వస్తుంది. ఇక్కడ కొనుగోలు చేసిన వస్తువులకు ఎటువంటి బిల్లులు ఇవ్వకుండా జీరో దందాను జోరుగా కొనసాగిస్తున్నారు. దీంతో సుమారు రెండొందల షాప్ ల  వారు బిల్లులు ఇవ్వకున్నా వారు చెప్పిన రేటుకు వినియో గదారులు అక్కడే కొంటున్నారు. విడిబాగాలకు ఎటువంటి వారంటీ, గ్యారంటీలు ఉండవు. ఈ విషయాన్ని మొబైల్ రిపేరింగ్ చేసేవారు వినియోగదారులకు చెప్పినప్పటికి గత్యంతరం లేక రిపేర్ చేయించుకుంటున్నారు. నాణ్యతలేని వస్తువుల కారణంగా నెల గడవక ముందే మళ్లీ రిపేర్ కు రావడం పరిపాటిగా మారింది.

అమ్మకాల్లో రాజస్థానీల రాజసం..

మొబైల్ పోన్ విడిభాగాల అమ్మకాల్లో రాజస్థానీల రాజసం ఉట్టిపడుతుంది. ఇక్కడ ఉన్న నాలుగైదు విడిభాగాల అమ్మకపు దుకాణాదారులు రాజస్థాన్ కు చెందిన వారు కావడం గమనార్హం. వీరంతా సిండికేట్ అయ్యి వినియోగదారులకు తమకు ఇష్టం వచ్చిన రేట్లకు ఆ విడిభాగాలను అమ్ముతూ మోసాలకు పాల్పడుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల అండతోనే వారు అక్రమాలకు పాల్పడుతున్నారని స్థాని కులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ విధానానికి అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.