calender_icon.png 3 December, 2025 | 6:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గత పాలకుల లెక్క నిర్లక్ష్యం చేయం

03-12-2025 06:42:06 PM

హైదరాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలేశ్వరమయిందని ఎద్దేవా చేశారు. నాడు కాంగ్రెస్ కట్టిన ఎస్ఆర్ఎస్పీ ఈనాటికీ చెక్కు చెదరలేదని,  కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతోనే ఇవాళ తెలంగాణ రాష్టంలో సాగు పెరిగిందని గుర్తు చేసుకున్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారమే ప్రజలకు రేషన్ కార్డులు ఇచ్చి సన్నబియ్యం ఇస్తున్నామని, 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. గత పాలకుల లెక్క హుస్నాబాద్ ను నిర్లక్ష్యం చెయ్యామని, గత పదేళ్లలో ఎవ్వరికీ డబుల్ బెడ్రూంలు రాలేదని విమర్శించారు. కానీ మేం పదేళ్లలో 20 లక్షల  ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.