08-10-2025 12:13:45 AM
హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాం తి): రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి పాలనా వైఫల్యం ప్రజలకు శాపంగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు మంగళవారం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పథకాల్లో కోతలు.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా వాతలు...
మాటల్లో ఫేకుడు.. ఢిల్లీకి వెళ్లి జోకుడు’.. ఇదే కదా రేవంత్‌రెడ్డి 22 నెలల్లో చేసిందని ఆయన విమర్శించారు. వేతనాలు అందక టీవీవీపీ, బస్తీ దవాఖానాల వైద్య సిబ్బంది నరకయాతన పడుతున్నారని తెలిపారు. ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం తప్ప అమలు చేసింది లేదన్నారు.