calender_icon.png 10 May, 2025 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: ఏసీపీ శ్రీనివాస్

17-04-2025 10:48:11 PM

హుజురాబాద్,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హుజురాబాద్ ఎసిపి శ్రీనివాస్ జి అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణ పరిధిలోని ఎసిపి కార్యాలయంలో గురువారం సబ్ డివిజన్ పరిధిలో రోడ్డు ప్రమాదలపై రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సబ్ డివిజన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న ప్రదేశాలను గుర్తించడం గుర్తించామన్నారు. ప్రమాదాలకు కారణమయ్యే ప్రదేశాలలో రంబుల్ స్ట్రిప్స్, బ్లింకర్స్ తో పాటు రోడ్డు ప్రమాద హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.

డిబిఎల్ వారు రోడ్డు నిర్మాణం చేస్తున్న సమయంలో కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ అవసరమైన ప్రదేశాలలో రంబుల్స్ ట్రిప్స్ ఏర్పాటు చేయడంతో పాటు బ్లింకర్స్ ను కూడా పెట్టాలని సూచించారు. ప్రతి రోజు పని షెడ్యూల్‌కు సంబంధించి కనీసం 24 గంటల ముందు సంబంధిత ఎస్‌హెచ్‌ఓకి సమాచారం అందించాలని  ఆదేశించారు. డ్రైవర్లు మద్యం సేవించి వాహనం నడిపిస్తున్నారా అనే దానిపై, ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో తరచుగా తనిఖీలు నిర్వహించాలని డీబీఎల్ అధికారులను ఆదేశించారు. రాత్రి వేళలో ప్రమాదం జరిగే ప్రదేశాలలో స్ట్రీట్ లైట్ల ఏర్పాటు కూడా చేసేలా కృషి చేస్తామన్నారు.  వాట్సాప్ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలోహుజురాబాద్ సిఐ తిరుమల్ గౌడ్, రూరల్ సీఐ పులి వెంకట్ గౌడ్, జమ్మికుంట సిఐలు వరగంటి రవి, కిషోర్, సబ్ డివిజన్ పరిధిలోని ఎస్సైలు, హైవే అథారిటీ అధికారులతో పాటు డిబిఎల్ అధికారులు పాల్గొన్నారు.