13-11-2025 10:20:41 PM
మల్యాల (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ఇటీవల పెంచిన ఆర్జిత సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు గురువారం ఆలయ ఈవో ప్రకటనలు తెలిపారు. పెంచినార్జిత సేవల రుసుము కేంద్రమంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకుపోగా దేవదయ శాఖ కమిషనర్ తో మాట్లాడి తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. కొండగట్టు దేవస్థానంలో కనీస వసతులు లేకుండా అర్జిత సేవలు పెంచడం సరికాదన్నారు. తక్షణమే అర్జిత సేవలను తగ్గించాలని కోరారు.