calender_icon.png 29 June, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరి ఎత్తిపోతల పథకాన్ని పునరుద్ధరించండి

28-06-2025 10:43:28 PM

మంగపేట,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం టీ. కొత్తగూడెం, ములుగు జిల్లా మంగపేట మండలం అకినేపల్లి మల్లారం జంట గ్రామాలను సస్యశ్యామలం చేసిన గోదావరి నది సీతారామ ఎత్తిపోతల పథకం కొంతకాలంగా మరామ్మత్తు లకు గురై రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నందున ఎత్తిపోతల పథకాన్ని పునరుద్ధరించాలని  జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కి విజ్ఞప్తి చేశారు.

శనివారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జిల్లా సరిహద్దు గ్రామమైన టి కొత్తగూడెం అకినేపల్లి మల్లారం గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఎంపీ బలరాం నాయక్ చొరవ తీసుకొని ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పునరుద్ధరించి ప్రారంభించాలని అకినేపల్లి మల్లారం టీ కొత్తగూడెం జంట గ్రామాలు కలిపి సుమారు రెండు వేల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలం చేయాలని సాంబశివరెడ్డి ఎమ్మెల్యే పాయంకి  విజ్ఞప్తి చేశారు.

దీంతోపాటు చేగర్షల నుండి టీ కొత్తగూడెం వరకు గల ఆర్ అండ్ బి రోడ్డు మంజూరు చేయాలని అదేవిధంగా మణుగూరు ఆర్టీసీ డిపో నుండి టీ కొత్తగూడెం పల్లె వెలుగు బస్ సర్వీస్ పునరుద్ధరిస్తే టీ కొత్తగూడంతో పాటు అకినేపల్లి మల్లారం గ్రామ ప్రజానీకానికి ఉపయోగపడుతుందని  ఆయన విజ్ఞప్తి చేశారు అనంతరం నాసిరెడ్డి సాంబశివరెడ్డి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ను శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డీ నాగిరెడ్డి కటుకూరి శేషయ్య పాడి హేమంత్ రెడ్డి దాట్ల నరేష్ రాజేష్ ముద్దుకృష్ణ చింటూ అకినేపల్లి మల్లారం  టి కొత్తగూడెం జంట గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.