calender_icon.png 1 August, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యథేచ్ఛగా మట్టి తవ్వకాలు

01-08-2025 12:00:00 AM

- తెలిసి తెలియనట్లు వ్యవహరిస్తున్న అధికారులు 

- ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

- అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి కనుసన్నల్లోనే అక్రమ తవ్వకాలు.. అక్రమ రవాణా

తాండూరు, జూలై 31 (విజయ క్రాంతి); వికారాబాద్ జిల్లా....తాండూర్ నియోజకవర్గంలో ఉన్న కొన్ని ప్రభుత్వ భూముల్లో అక్ర మ మట్టి తవ్వకాలకు అడ్డగా మారాయి.నిబంధనల ప్రకారం సంబంధిత అధికారుల ద్వారా అనుమతులు తీసుకొని తవ్వకాలు జరపాల్సి ఉండగా అవేమి లేకుండానే ప్రభు త్వ భూముల్లో రాత్రింబవళ్లు యదేచ్చగా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతూ అక్రమాలకు తెగబడుతున్నారు.

ప్రభుత్వ భూము ల్లో ఏదేని ఖనిజ తవ్వకాలు జరపాలి అనుకుంటే రెవెన్యూ మరియు గనులు భూగర్భ శాఖ మరియు అటవీ శాఖ జిల్లా అధికారుల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అ నుమతులు వచ్చాకనే ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు రవాణా జరపాలి.కానీ ప్రభుత్వ భూముల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాల ను అడ్డుకోవాల్సిన రెవెన్యూ శాఖ మరియు గనులు భూగర్భ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం తో అధికారులకు మచ్చిక చేసు కొని వ్యవహారం నడిపిస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి.

నియోజకవర్గంలో పెద్దేముల్ మండలం కందనెల్లి తాండ ప్రభుత్వ భూమి స ర్వే నంబర్ 240, యాలాల మండలం కోక ట్ గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 52 లో భారీ యంత్రాలతో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతూ టిప్పర్ల సహాయంతో రా త్రింబవళ్లు యదేచ్చగా మట్టిని రవాణా సై తం చేస్తున్నారు.ఈ అక్రమాల వెనుక కాం గ్రెస్ పార్టీకి చెందిన ఓ ప్రధాన నాయకుడి కనుసన్నల్లోనే జరుగుతున్నాయని విమర్శలు వినవస్తున్నాయి.జిల్లాలో ఎక్కడా లేని విధంగా తాండూర్ నియోజకవర్గంలోని ప లు ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు జరుపుతుండడంతో అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డా గా మారింది.

అనుమతులు తీసుకొని మట్టి తవ్వకాలు జరిపితే కనుక తవ్వకాలు చేసినందుకు, రవాణా చేసినందుకుగాను ప్రభుత్వ ఆదాయానికి భారీగా లాభం వచ్చే అవకాశం ఉంది.గత అసెంబ్లీ ఎన్నికల సమ యంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో అవినీతి అక్ర మాలు జరగకుండా చూసే బాధ్యత తనదేనని అక్రమాలు ఏవైనా జరిగితే తనకు సమాచారం ఇవ్వాలని అప్పట్లో ఆయన తెలిపారు.అయినా కొందరు అక్రమార్కులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాటలను బేఖాతరు చేస్తూ యదేచ్చగా మొరం మట్టి అక్ర మంగా మట్టి తవ్వకాలు చేస్తూ అందిన కాడి కి తొవ్వుకుంటూ అక్రమార్జన కు తెగబడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికా రులు స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికు లుకోరుతున్నారు.