calender_icon.png 17 August, 2025 | 4:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

17-08-2025 12:20:04 AM

భద్రాచలం వద్ద 29 అడుగులు చేరిన నీటిమట్టం

భద్రాద్రి కొత్తగూడెం/భద్రాచలం, ఆగస్టు 16 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువనున్న ప్రాం తాలలో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శనివారం సాయంత్రానికి 29.6 అడుగులకు చేరుకుం ది. శనివారం అర్ధరాత్రికి 32 లేదా 33 అడుగులకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 29 అడుగులకు భద్రాచలం వద్ద నీటిమట్టం చేరుకోగానే స్నానఘట్టాల వద్ద గల మెట్లు నీటిలో మునిగిపోయాయి. 

నిండుకుండను తలపిస్తున్న కిన్నెరసాని 

కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని పాల్వంచ మండలం యానంబైలు వద్ద గల కిన్నెరసాని జలాశయం నిండుకుండను తలపిస్తున్నది. 407 అడుగుల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో శనివారం మధ్యాహ్నం వర కు 404.50 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. జలాశయానికి 14,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో అప్రమత్తమైన జెన్కో అధికారులు రెండు గేట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తి పదివేల క్యూసెక్కుల నీటిని బయటికి విడుదల చేస్తున్నారు.