17-08-2025 12:17:22 AM
మెదక్, ఆగస్టు 16 (విజయక్రాంతి): మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల ఆలయం వద్ద వరద ఉధృతి మూడోరోజు కొనసాగుతోంది. ఓవైపు వర్షాలు కురుస్తుండటం, మరోవైపు సింగూరులో వరద ప్రవాహం పెరగడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఏడుపాయల వద్ద వన దుర్గామాత ప్రాజెక్టు పొంగి ప్రవహిస్తుండటంతో ఆలయం ముంపునకు గురి అయింది.