17-08-2025 12:20:05 AM
-మూతపడ్డ కల్లుగీత దుకాణాలను తెరిపించాలి
-బాలగోని బాలరాజ్ గౌడ్
ముషీరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): భారత తొలి తెలుగు విప్లవ వీరుడు, బహుజన రాజ్య స్థాపకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవాలను ఈ నెల 18న చిక్కడపల్లిలోని కల్లు కంపౌండ్ లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, వర్కింగ్ చైర్మన్ యెలికట్టే విజయ్ కుమార్ గౌడ్ లు తెలిపారు.
శనివారం చిక్కడపల్లిలోని సమన్వయ కమిటీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్, వైస్ చైర్మన్ గడ్డమీది విజయ్ కుమార్ గౌడ్, ఎస్, దుర్గయ్య గౌడ్, బైరు శేఖర్, బడే సాప్, సింగం నాగేశ్వర్ గౌడ్, బాలగోని వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.