calender_icon.png 17 August, 2025 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి

16-08-2025 12:00:00 AM

  1. రాష్ర్టంలో ప్రజాపాలన సాగుతోంది
  2. ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు

మంచిర్యాల, ఆగస్టు 15 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ర్టం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుందని, ప్రజా పాలన సాగుతోందని ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు అన్నారు. శుక్ర వారం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.

ఉగాది నుంచి “సన్న బియ్యం” పంపిణీ ని ప్రారంభించి జిల్లాలోని 2,47,923 మంది కార్డుదారులకు పంపిణీ చేశామన్నారు. జూలై 14 నుంచి కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకోగా అరులైన 24,౦79 మందికి నూతన రేషన్ కార్డులు, మెంబర్ అడిషన్ కోసం 53,౦40 దరఖాస్తులు రాగా పరిశీలించి  41,677 మందిని చేర్చామన్నా రు. రైతు భీమా కింద 83,114 మంది రైతులను చేర్చి 347 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున రూ. 17.35 కోట్లు చెల్లించామన్నారు.

వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌లో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నదాతల సంక్షేమానికి రూ. లక్ష 13 వేల కోట్లను ఖర్చు చేశామన్నారు. జిల్లాలో ఉచిత రవాణా ద్వారా 2,24,౦3,654 మంది మహిళలకు లబ్ది చేకూరింది. 500 రూపాయలకే వంటగ్యాస్ సరఫరా ద్వారా మహిళలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించి 1,22,837 మంది లబ్దిదారులకు రూ. 14,63,44,౦౦౦ రాయితీ మంజూరు చేశామన్నారు.

200 యూనిట్ల ఉచిత విద్యుత్ జిల్లాలో ప్రతి నెల సుమారుగా లక్ష నివాసాలకు, ఇందిరా మహిళా శక్తి కింద దండేపల్లి మండలంలో సౌర విద్యుత్ ప్లాంట్లు శంఖుస్థాపన చేసి మరొక ప్లాంట్‌కు మందమర్రి మండలాన్ని గుర్తించామన్నారు. పెట్రో లు బంకుల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ, మహిళా సంఘాల ద్వారా బస్సులతో అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు.

అనంతరం ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రా లు అందజేసి ఆయా శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ వేడుకలలో బెల్లంపల్లి ఎంఎల్‌ఏ గడ్డం వినోద్, తెలంగాణ రాష్ర్ట కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్, కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీసీపీ ఎగ్గడి భాస్కర్, డీఎఫ్‌ఓ శివ్ ఆశీష్ సింగ్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.