calender_icon.png 16 August, 2025 | 9:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏరియాలో పర్యటించిన సింగరేణి డైరెక్టర్

16-08-2025 07:47:02 PM

మణుగూరు,(విజయక్రాంతి): ఏరియాలో సింగరేణి ఎగ్జి క్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూ వ్మెం ట్)  చీఫ్ విజిలెన్స్ ఆఫీ సర్ బానోత్  వెంకన్న శనివారం పర్యటించారు. జిఎం దుర్గం రామచందర్ తో కలిసి OC -2, ఓసి -4, మణుగూరు ఓసి గనిని వ్యూ పాయింట్ ద్వారా సందర్శించారు. ఓసియ-2, ఓసి-4 గనుల యందు క్రషర్ల దగ్గర జరుగుతున్న ఉత్పత్తిని పరిశీలించారు.  అనంతరం కేసీహెచ్పీ వద్ద బొగ్గు నాణ్యతను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం జి‌ఎం కార్యాలయ సమావేశ మందిరంలో  అన్నీ విభాగాల ఉన్నత అధికారుల తో సమీక్షా సమావేశం నిర్వహించి, ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణాపై  సంబంధిత అంశాలను చర్చించారు. భూగర్భ, ఉపరితల గనులు, డిపార్ట్‌మెంట్‌లలో పనిచేసే ఉద్యోగులు తప్పని సరిగా రక్షణ సూత్రాలు పాటిస్తూ  అధికోత్పత్తికి పాటు పడాలన్నారు.