02-01-2026 12:00:00 AM
-ఆధ్యాత్మిక దిశానిర్దేశం చేసిన పరమపూజ్య
శ్రీశ్రీశ్రీ వామనాశ్రమ మహా స్వామీజీ
రఘునాధపాలెం ఖమ్మం/జనవరి 1: వారణాసి మరియు హలదీపూర్ కర్ణాటక మఠాధిపతి వైశ్యకుల గురువులు పరమపూజ్య శ్రీశ్రీశ్రీ వామనాశ్రమ మహా స్వామీజీ గారి ఖమ్మం పర్యటనలో భాగంగా ఈరోజు ప్రముఖ దేవాలయాలను గుట్టల బజారులోని కన్యాకాపరమేశ్వ రి దేవీ ఆలయం మరియు గాంధీ చౌక్ లోని శ్రీ షిరిడీ సాయి మందిరాన్ని సందర్శించారు. కాశీ లో కుల మూల పీఠం నిర్మాణానికి అనేకమంది ఆర్య వైశ్యులు ఇతోధికంగా భూదానం నిమిత్తం సహకారం అందించడం జరిగింది.సమాజం మరింత శక్తివంతంగా హిందూ ధర్మ రక్షణలో భాగం కావాలని, వైశ్య సమాజం ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు ముందు తరానికి చేరే విధంగా కృషి చేయాలని వామనాశ్రమ మహా స్వామీజీ భక్తులకు ఉపదేశించడం జరిగింది.
వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు చెప్పిన ఐదు ఉపదేశాలు ఏమనగా అహింసా, ధర్మం, సత్యం, పరోపకారం, ఆత్మార్పణ ను మరవకుండా ఎల్లపుడు పాటించాలని భక్తులకు భోదించడం జరిగింది.ఈ దైవ కార్యక్రమంలో బిజెపి పార్టీ రాష్ట్ర కోశాధికారి శ్రీ దేవకీ వాసుదేవ రావు కన్యాకాపరమేశ్వరి దేవీ ఆలయం ఛైర్మన్ మేళ్లచెరువు వెంకటేశ్వర్లు, కార్యదర్శి దేవత అనిల్, ఉపాధ్యక్షులు గోళ్ళ భాస్కర్, శ్రీ షిరిడీ సాయి మందిరం ఆలయ ఛైర్మన్ వేముల్లపల్లి వెంకటేశ్వర్లు, షిరిడీ సాయి భజన మండలి అధ్యక్షులు గన్నవరపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.