10-10-2025 12:33:31 AM
ఆర్కే కళాశాలల గ్రూప్ సీఈవో జైపాల్ రెడ్డి
కామారెడ్డి, అక్టోబర్ 9 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో సోహం అకాడమీ ఆధ్వర్యంలో రోబోటిక్స్ వర్క్‌షాప్ విజయవంతంగా నిర్వహించినట్లు ఆర్కే కళాశాల గ్రూప్ సీఈవో డాక్టర్ జైపాల్ రెడ్డి అన్నారు. గురువారం శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్ డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొ న్నారు. ఈ రెండు కళాశాలల్లో ఇది రెండోసారి రోబోటిక్స్ శిక్షణ జరగడం విశేషం అన్నారు.
విద్యార్థులకు రోబోటిక్స్ ప్రాథమికాలు, హార్డ్వేర్ పరిజ్ఞానం, ప్రాజెక్ట్ డిజైన్ మరియు ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వబడిందన్నారు. ముఖ్యంగా, గత సంవత్సరం ఈ కళాశాల ట్రైనర్లు ప్రభుత్వ పాఠశాలల్లో వర్క్‌షాప్‌కు వెళ్లి విద్యార్థులకు మెంటర్గా మారి మార్గనిర్దేశం చేశారు. ఈ ఏడాది కాలేజీలో రెండవసారి రోబోటిక్స్ వర్క్‌షాప్ నిర్వహించడం విశేషం. త్వరలో ఈ ట్రైనర్లు మళ్లీ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులను ఇన్నోవేషన్ మోడల్స్ రూపొందించడంలో ప్రోత్సహించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కళాశాలల మద్దతు ఎంతో విశేషంగా నిలిచిందని ట్రేనర్స్ ప్రహర్ష, సంతోష్ లు తెలిపారు. గత కొన్ని సంవత్సరాల్లో సోహం అకాడమీ తెలంగాణలోని 25 జిల్లాల్లో 447 పాఠశాలలు, 85,627+ పాఠశాల విద్యార్థులు, అలాగే 46 కాలేజీల్లో 4,317+ కళాశాల విద్యార్థులకు రోబోటిక్స్ శిక్షణను అందించింది. ఇప్పుడు కామారెడ్డి జిల్లా కూడా ఈ ఎకోసిస్టమ్లో భాగమైందన్నారు.
సోహం అకాడమీ తెలంగాణ రాష్ట్రాన్ని రోబోటిక్స్ విద్యలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. విద్యార్థులకు సోహం అకాడమీ ద్వారా అడ్వానస్డ్ టెక్నాలజీ & రోబోటిక్స్ లో శిక్షణ ఇచ్చి, తద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదువుచున్న విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆర్కె కళాశాల సీఈవో డా. యం జైపాల్ రెడ్డి తెలిపారు. ఈ ప్రోగ్రామ్ లో కో ఆర్డినేటర్ దత్తాత్రి, డీన్ నవీన్, ప్రిన్సిపాల్ గోవర్ధన్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.