10-10-2025 12:34:42 AM
వెహికల్ ఇన్స్పెక్టర్ సుభాష్
నిజామాబాద్ అక్టోబర్ 9 (విజయ క్రాంతి) : హైదరాబాద్ లోని గాంధీభవన్ లొ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో రిటైర్డ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుభాష్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని గురువారం పార్టీలో చేరారు.
ఆయన 1987 నుండి 1992 మధ్యకాలంలో వేల్పూరు మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు . ప్రభుత్వ సర్వీసులో 31 సంవత్సరాలు రవాణా శాఖ అధికారిగా విధులు నిర్వహించి రిటైర్మెంట్ అనంతరం ప్రస్తుతం తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయనకు. రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వాగతం పలికారు.