calender_icon.png 10 October, 2025 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల హామీలు నీటి మూటలు

10-10-2025 12:33:19 AM

-హామీల అమలులో కాంగ్రెస్ విఫలం

-మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు 

మానకొండూరు, అక్టోబర్ 9 (విజయ క్రాంతి)కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ల పేరిట నాలుగు కోట్ల మంది ప్రజలను మోసం చేసిందని అధికారం కోసం అడ్డగోలు హా మీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మానకొండూరు మా జీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ కార్డుకు దీటుగా బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు తెచ్చిందని చెప్పారు. బాకీ కార్డులను నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి చేరవేయాలని ఆ పార్టీ మోసాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మానకొండూరులోని భారాస జిల్లా కార్యాలయంలో గురువారం పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బాకీ కార్డులు విడుదల చేసి రసమయి మాట్లాడారు.

అధికారంలోకి వచ్చి 22 నెలలైనా ఏ ఒక్క హామీని సక్రమంగా నెరవేర్చలేదన్నారు. మహిళలకు రూపాయలు 2,500 చొప్పున 22 నెలలకు ఒక్కొక్కరికి 55 వేలు, వృద్ధులకు 44 వేలు, వికలాంగులకు 64 వేలు, కళ్యాణ లక్ష్మి పథకం కింద వివాహమైన ప్రతి మహిళకు తులం బంగారం తదితర హామీలు ఏమయ్యాయని మీడియా సాక్షిగా నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ను తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నియోజకవర్గంలోని 6 జెడ్పిటిసిలు, ఎంపీపీ స్థానాల్లో భారాస విజయ ఢంకామోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

బాకీ కార్డులను ఇంటింటికీ చేర్చి ఓట్లు అడిగే కాంగ్రెస్ నాయకులను బాకీ కార్డులు చూపి నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎవరెవరికి ఎంత బాకీ ఉన్నారో తెలిపేలా బాకీ కార్డులను పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. మానకొండూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు, జడ్పిటిసిలు, ఎంపీపీలు తాజా, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు అధిక సంఖ్యలో కార్యక్రమానికిహాజరయ్యారు.