calender_icon.png 31 August, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమతులతో పనేంటి

30-08-2025 11:07:43 PM

ఇబ్బడి ముప్పడిగా ఫ్లెక్సీలు 

చోద్యం చూస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు 

ప్రమాదాలకు నెలయంగా ఫ్లెక్సీలు, కటౌట్లు

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ, కొత్తగూడెం డివిజన్లలో ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద పెద్ద కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న కార్పొరేషన్ అధికారులు చోద్యం చూస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ ఫ్లెక్సీలను రోడ్డు పొడవునా, మూల మలుపుల వద్ద ఏర్పాటు చేస్తున్న  కార్పొరేషన్ అధికారులు నిమ్మకు నేరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. వాహనాలు మూల తిరిగేటప్పుడు ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మహానచోధకులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఫ్లెక్సీల కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్న పోలీస్ శాఖ కూడా ఏమీ పట్టనట్టు వ్యవహరించడం గమనార్హం. ఒకవైపు కార్పొరేషన్ ఆదాయాన్ని గండి కొడుతూ, ప్రమాదాలకు నిలయంగా వెలుస్తున్న ఫ్లెక్సీలను నియంత్రించాలని కార్పొరేషన్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మొన్న పాల్వంచ డివిజన్లో కుల సంఘం నాయకుడి పుట్టినరోజు సందర్భంగా విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయం విధితమే. నేడు కొత్తగూడెం డివిజన్లో ఓ రాజకీయ నాయకుడి పుట్టినరోజు సందర్భంగా పెద్దపెద్ద కటౌట్లను, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో అంతర్యం ఏమిటో వారికే తెలియాలి.