15-11-2025 12:00:00 AM
మునిపల్లి, నవంబర్ 14 :రూమ్ టు రీడ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రూం టు రీడ్ సంస్థ నుండి ఐఎంసి ఆర్ట్ కాంటెస్ట్ కార్యక్రమాన్ని మండలంలోని పెద్దగోపులారం స్కూల్ లో నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్‌ఎం తుకారం, ఎంఎన్ వో భాస్కర్ మాట్లాడుతూ లైబ్రరీ పుస్తకాలను ఉపయోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు.
అంతకు ముందు విద్యార్థులు చేసిన నాటకం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వర్, ఉపాధ్యాయులు సత్యవాణి, జ్యోతి, కవిత, అనురాధ, వీరయ్య, రూమ్ టు రీడ్ లిటరసీ ఫెసిలిటేటర్ సంధ్య తదితరులుపాల్గొన్నారు.