15-11-2025 12:00:00 AM
--విద్యార్థి దశలో చదువు ప్రధాన లక్ష్యంగా ఉండాలి
--జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
ములుగు, నవంబర్ 14 (విజయక్రాంతి):చదువే ధ్యేయంగా ధైర్యంగా ముందుకు సాగాలని, విద్యార్థి దశలో చదువు ప్రధాన లక్ష్యంగా ఉండాలని స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగితేనే బలమైన భవిష్యత్తు నిర్మించుకోవచ్చని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు బాలల దినోత్సవం సందర్భంగా దిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ ఎల్ ఎఫ్ ఇంగ్లీష్ లెర్న్ టు రీడ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ని తన ఛాంబర్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇంగ్లీష్ లో ఇంటర్వ్యూ నిర్వహించి అభిరుచులు, రోల్ మోడ్ప విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముఖాముఖి నిర్వహించారు. బాలల దినోత్సవం ప్రాముఖ్యతపై చిన్న రోల్ ప్లే కూడా చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. దిశా ఫౌండేషన్ భాగస్వామ్యంతో జిల్లాలోని 72ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ చదవడం నేర్చుకునే ప్రోగ్రాం అమలవు తుందని అన్నారు. తద్వారా విద్యార్థులు నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం లభించిందని అన్నారు.