10-09-2025 12:35:59 AM
రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 09 (విజయక్రాంతి) వేములవాడ రాజన్న భ క్తులు ఎంతో కాలంగా ఎ దురు చూస్తున్న రాజన్న ఆలయ విస్తరణ అభివృ ద్ధి పనులు మొదలు అ య్యాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.. మంగళవారం రాజన్న ఆలయ ఈఓ ఛాంబర్ లో రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణ పనుల పురోగతి పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
అనంతరం ఎండోమెంట్ కమిషనర్ తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఆలయ ఈఓ రమా దేవి పాల్గొన్నారు.ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ఆగమ శాస్త్ర ఆధారంగా ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు శీఘ్ర దర్శనం, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేలా ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు.
రాజన్న ఆలయ విస్తరణ పనులను జూన్ 15వ తేదీన ప్రారంభం చేస్తామని గతంలో తెలిపినట్లుగానే యాదృచ్ఛికంగా అదే రోజు రాజన్న ఆజ్ఞతో పనులు ప్రారంభమయ్యాయి అని తెలిపారు. శృంగేరి పీఠాధిపతుల సూచనలతో రాజన్న ఆలయాన్ని విస్తరణ చేపడుతున్నట్లు తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి టెండర్లు పిలిచామని, వీటిలో ఆలయ విస్తరణకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడత కింద 76 కోట్లు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి తెలిపారు.
ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి కైంకర్య సేవలు, ఏకాంత, ఇతర సేవలు యధావిధిగా నిరంతరాయంగా కొనసాగుతాయని తెలిపారు. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు జరిగే సమయంలో వేములవాడ క్షేత్రంలో భీమేశ్వర ఆలయంలో భక్తులకు దర్శనం ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.రాజన్న ఆలయ పనులను స్వంత ఇంటి నిర్మాణం చేస్తున్నట్టు భావించి పనులు చేయాలని, భీమేశ్వర ఆలయంలో ఇప్పటికే షెడ్స్ పనులు చివరి దశలో ఉన్నాయని, ఫ్లోరింగ్ పనులు త్వరలోనే ప్రారంభం చేసి పూర్తి చేస్తామని తెలిపారు.