calender_icon.png 30 October, 2025 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ నుండి అరుణాచలానికి ఆర్టీసీ బస్సు..

30-10-2025 07:06:00 PM

నిర్మల్ రూరల్ (విజయక్రాంతి): పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆర్టీసీ నిర్మల్ డిపో నుండి నవంబర్ 7వ తేదీ రోజు కలియుగ కైలాసం అయిన అరుణచలానికి సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ కే పండరి తెలిపారు. ఈ బస్సు నవంబర్ 7వ తేదీ రోజు మధ్యాహ్ననం ఒంటి గం.లకు నిర్మల్ బస్టాండ్ నుండి బయలు దేరి మరుసటి రోజు ఉ.6 గం.లకు ఆంధ్రప్రదేశ్ లోని కానిపాకం చేరుకుంటుంది. కానిపాకంలో గల వారసిద్ది వినాయకుణ్ణి దర్శించుకొని మధ్యాహ్ననం తమిళనాడులోని లక్ష్మి అమ్మవారి గోల్డెన్ టెంపుల్ చూసుకొని సాయంత్రం తిరువన్నామలై లోని అరుణాచలం చేరుకుంటుంది. సాయంత్రం అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకొని కార్తీక దీపాలు వెలిగించి 14 కి.మీ. గిరి ప్రదక్షిణ చేస్తాము.

ఆ రోజు అరుణాచలంలోనే బస. తెల్లవారు కలియుగ వైకుంఠం అయిన తిరుపతి చేరుకుంటాము. అక్కడ దిగువ తిరుపతిలో శ్రీనివాస కంప్లెక్స్ లో ఎస్.ఎస్.డి. టోకెన్ లు తీసుకొని వారు ఇచ్చిన సమయంలో శ్రీవారిని దర్శించుకొంటాము. దిగువ తిరుపతిలో గల గోవింద రాజులు,అలివేలు మంగ దర్శనం, కొండపైన శ్రీవారి పాదాలు, పాప నాశనం, ఆకాశాగంగా వివిధ గుళ్ళు గోపురాలు దర్శించుకొని తిరిగి 5 వ రోజు నిర్మల్ చేరుకొనును.ఈ యాత్ర 5 రోజులు ఉంటుంది. ఒకరికి రాను పోను కలిపి ఒకరికి  6300/- రూ!! లు ఉంటుంది. భోజన వసతి సౌకర్యం ప్రయాణికులవే ఉంటాయి. ఈ యాత్ర వెళ్లదలచిన వారు ముందస్తుగా ఆన్ లైన్ ద్వారా కాని నిర్మల్ బస్టాండ్ లో కాని ముందస్తు బుకింగ్ చేసుకోవాలని ఆయన తెలిపారు.మరిన్ని వివరాలకు 9959226003, 83280 21517, లేదా 7382842582 లో సంప్రదించాలని డిపోమేనేజర్ తెలిపారు.