27-09-2025 12:38:19 AM
వనస్థలిపురంలో ప్రారంభించిన సినీ నటులు నాగచైతన్య, శోభిత ధూళిపాల
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): ఆర్‌ఎస్ బ్రదర్స్ వారి అతిపెద్ద 15వ షోరూమ్ శుక్రవారం హైదరాబాద్ వనస్థలిపురంలో ప్రారంభమైంది. వనస్థలిపురం ప్రాంతంలో ఓల్ పనామా గోడౌన్స్ సమీపంలో ఉన్న బొమ్మిడి ఎలైట్ టవర్స్‌లో ప్రముఖ సినిమా జంట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాల ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లా డుతూ..- “ఆర్‌ఎస్ బ్రదర్స్ పేరు వింటే చాలు- సంప్రదాయం, విశ్వసనీయత, సరికొత్త ఫ్యా షన్లు గుర్తుకు వస్తాయి.
ఈ సరికొత్త షోరూ మ్ హైదరాబాద్ వనస్థలిపురం వాసులకు అద్భుతమైన షాపింగ్ గమ్యంగా నిలుస్తుంది అని చెప్పటంలో సందేహం లేదు” అన్నారు. శోభిత ధూళిపాల మాట్లాడుతూ..- “ఆర్‌ఎస్ బ్రదర్స్ వారి ఈ సరికొత్త షోరూమ్ కేవలం వస్త్రాలకే పరిమితం కాదు. వేడుకలకు ప్రతిబింబం. పండుగలు మొదలుకుని వివాహాది శుభకార్యాల కలెక్షన్స్ వరకు కుటుంబంలోని అన్ని తరాల వారి అవసరాలకు అచ్చంగా సరిపోయే అనేక వైవిధ్యభరితమైన విశేషాలు ఈ షోరూమ్లో అడుగడుగునా అలరిస్తాయి” అన్నారు.
ఆర్‌ఎస్ బ్రదర్స్ సంస్థాపకుడు, చైర్మన్ పి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ- “సంప్రదాయాలను, ఫ్యాషన్లను ప్రతిబింబించే విధంగా మా 15వ షోరూమ్ను వనస్థలిపురంలో నెలకొల్పడం మాకెంతో గర్వకారణం గా ఉంది. ఈ ప్రాంతం లోని ప్రతి కుటుంబానికీ ఇది షాపింగ్ గమ్యం అవుతుందని మా గట్టి నమ్మకం” అన్నారు.
ఆర్‌ఎస్ బ్రదర్స్ సంస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ రాజమౌళి మాట్లాడుతూ- “అతి పెద్దదైన మా సరికొత్త షోరూమ్ను వనస్థలిపురంలో నెలకొల్పడం ద్వారా షాపింగ్లో వైవిధ్యాన్నీ, విలువలనూ మరో స్థాయికి తీసుకు వెళ్లామని చెప్పడానికి ఎంతో ఆనందిస్తున్నాం” అన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్ బ్రదర్స్ సంస్థాపకుడు, హోల్ టైం డైరెక్టర్ టి. ప్రసాదరావు మాట్లాడారు.