27-09-2025 12:37:30 AM
పెద్ద ఎత్తున ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలు
విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే వెంకటరావు
భద్రాచలం, సెప్టెంబర్ 26,(విజయక్రాంతి):శ్రీ దేవి శరన్నవత్రుల సందర్బంగా భద్రాచలం భగవాన్ దాస్ కాలనీ లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిధిగా భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కుంజా ధర్మ, భద్రాచలం తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఆర్ ఐ బుద్ధ నరసింహారావు పాల్గొన్నారు. శుక్రవారం నిర్వహించిన ముగ్గుల పోటీలకు భద్రాచలంలో వివిధ ప్రాంతాల నుండి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మొదటి బహుమతి బి రాజేశ్వరి, రెండవ బహుమతి బి వాణి, మూడో బహుమతి ప్రియ, నాలుగో బహుమతి వశం హరిప్రియ, ఐదవ బహుమతి హానిష గెలుపొందారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ మహిళలు ఎంతో ఉత్సాహంగా ముగ్గుల పోటీలలో పాల్గొన్నారని , అమ్మ వారి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని అన్నారు.
ఈ పోటీలలో గెలుపొందిన వారికీ బహుమతులు అందించిన దాత సమ్మక్క సారక్క దేవుడమ్మ తూరుబాక కి కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో భూక్యా రంగా, ముగడ హరినాథ్, ఎస్కే సిరాజ్, ప్రియ, సాయి కౌశిక్, గణేష్, వినీత్, నాగేశ్వర రావు, సుదర్శన్, రామాచారి, సున్నం భూలక్ష్మి, తెల్లం సునీత, స్వరూప, సుశీల, లీలావతి, ప్రియాంక, రమణమ్మ, క్రిష్ణ ప్రియ,కైక, కుమారి,అనిత, ఉష, వాణి, రమణ, కమల, యశోద, మీనా, మహేష్, సంతోష్, హరికృష్ణ, గోపాల కృష్ణ, లత, రమ్య, జయ, మని, భక్తులు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.