calender_icon.png 15 January, 2026 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధర్మం ముసుగులో దాడులా?

18-11-2025 01:09:23 AM

-సీజేఐ మీద దాడి.. దళితుల మీద జరిగిన దాడినే 

-ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ 

-న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దళితుల ఆత్మగౌరవ సభ 

హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గ వాయ్ మీద జరిగిన దాడి దేశంలోని 30 కో ట్ల మంది దళితుల మీద జరిగిన దాడే అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. సీజేఐ మీద దాడిని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం నిర్వహించిన దళితుల ఆత్మగౌరవ సభలో ఆయన మాట్లాడారు. చట్టప రమైన వ్యవస్థలు దళితుల మీద దాడులకు పాల్పడుతున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

ధర్మం ముసుగులో, విశ్వాసాల ముసుగులో దాడులకు పాల్పడే వారికి చట్టాలు వర్తించవా అని నిలదీశారు. ధర్మం ముసుగులో, విశ్వాసాల ముసుగులో దాడులకు పాల్పడే వారికి తగి న గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు. న్యాయ వ్యవస్థ , డిల్లి పోలీసు వ్యవస్థ, జాతీ య మానవ హక్కుల కమిషన్ తమ కర్తవ్యాలను అమలు చేయడంలో పూర్తి వివక్షతను చూపెట్టాయని విమర్శించారు. జస్టిస్ గవా య్ మీద దాడి జరిగి నెల రోజులు గడిచినా చట్టపరంగా ఒక చర్య కూడా ఎందుకు తీసుకోలేదు అని నిలదీశారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని దుయ్యబట్టారు.

రాజ్యాంగాన్ని తొలగించి మను ధర్మాన్ని ప్ర జల మీద రుద్దాలని చూసే వారెవరైనా తమకు బద్ద శత్రువులే అని ప్రకటించారు. ప్రజాస్వామ్య స్థానంలో రాచరిక వ్యవస్థ తీసుకొచ్చే మను ధర్మాన్ని సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్  జాతీయ అధ్యక్షులు డా. మున్నంగి నాగరా జు మాదిగ, తెలంగాణ రాష్ర్ట అధ్యక్షులు డా. గోవిందు నరేష్ మాదిగ, జాతీయ నాయకు లు సొట్ట నరేంద్ర బాబు మాదిగ, నార్త్ ఇం డియా ఇన్‌చార్జ్  కడార్ల నవీన్ చారి, ఏపీ అధ్యక్షులు   రుద్రపోగు సురేష్ ,  కర్ణాటక అ ధ్యక్షులు నర్సప్ప, మహారాష్ర్ట అధ్యక్షులు అ జిత్, ఉత్తరాఖండ్ అధ్యక్షులు  ఆశిష్ కుమా ర్, తమిళనాడు అధ్యక్షులు  లోకేష్, హర్యాన అధ్యక్షులు సత్యపాల్‌తో పాటు  ఉత్తర,  దక్షిణ రాష్ట్రాల నుంచి నాయకులు,  కార్యకర్తలు పాల్గొన్నారు.