18-11-2025 01:11:10 AM
-ఎత్తిపోతల పథకాలను వందశాతం పూర్తిచేస్తాం
-నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్
-మిర్యాలగూడలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
-హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్లగొండ, నవంబర్ 17 (విజయక్రాంతి) : మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని నీటిపారుదల, పౌ రసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం అయన రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి, నల్లగొండ ఎంపీ కుం దూరు రఘువీర్‌రెడ్డితో కలిసి మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ.171.5 కోట్ల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. మిర్యాలగూడ నియోజకవర్గంలో సాగునీరు అందించే ఆయకట్టులో ఎక్కడా సమస్యలు లేకుండా నీరిస్తామన్నారు. అలాగే మొదలుపెట్టిన అన్ని ఎత్తిపోతల పథకాలను నూటికి నూరు శాతం పూర్తి చేస్తామని చెప్పారు. రా ష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి తామందరం కట్టుబడి ఉన్నామన్నారు. ధాన్యం సేకరణలో భాగంగా ప్రతి గింజను కొంటామని, ప్రతి వరి రైతుకు న్యాయం చేస్తామన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇచ్చేందుకు దృఢ సంకల్పంతో ఉన్నామని, సామాజిక న్యాయం సంకల్పంతో ముందుకెళ్తున్నామని, ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.
మిర్యాలగూడ నియోజకవర్గంలో మెయిన్ కెనాల్ లైనింగ్ కి 57 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అంతేకాక నియోజకవర్గంలోని దుబ్బ తండ, శాంతినగర్, రావులపెంట చెక్ డాంల నిర్మాణానికి 24 కోట్ల రూపాయలను, ఫీడర్ చానళ్ల నిర్మాణానికి సుమారు 20 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న 5 లిఫ్ట్ ఇరిగేషన్లను త్వరలోనే పూర్తి చేస్తామని వెల్లడించారు.
ప్రతి గ్రామానికి డబుల్ రోడ్డు: మంత్రి కోమటిరెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. మిర్యాలగూడ నియోజకవర్గంలో రూ.250 కోట్లతో హ్యమ్ రోడ్లు మంజూరు చేశామన్నారు. ప్రతి గ్రామం నుంచి మం డల కేంద్రానికి డబుల్ రోడ్డు నిర్మిస్తున్నామని, నాగార్జునసాగర్ నియోజకవర్గానికి రూ. 450 కోట్లు, దేవరకొండ నియోజకవర్గానికి రూ.350 కోట్లతో హ్యాం రోడ్లకు టెండర్లు పిలవనున్నామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా రూ.65వేల కోట్లతో తెలంగాణ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఆర్ అండ్ బి రహదారులు చేపడుతున్నామని తెలిపా రు. హైదరా బాద్- విజయవాడ రహదారిని రూ.10,500 కోట్లతో చేపట్టనున్నామని, హైదరాబాద్- చిట్యాల రోడ్డు రూ.7600 కోట్లతో చేపట్టనున్నామన్నారు. కార్యక్రమం లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ తదితరులు పాల్గొన్నారు .