29-09-2025 12:06:30 AM
యాదాద్రి భువనగిరి సెప్టెంబర్ 28 ( విజయక్రాంతి ): ఆర్ ఎస్ ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఆదివారం భువనగిరిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. 5 వేరు వేరు ప్రాంతాలలో ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు రూట్ మార్చ్ జరిపారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాలలో ఆర్‌ఎస్‌ఎస్ తక్షణమాధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి సిరిగే శివకుమార్, రాష్ట్ర సేవా ప్రముఖ్ గాజుల శివశంకర్, విభాగ్ కార్యవాహ మంత్రి ప్రగడ శ్రీధర్, విభాగ్ వ్యవస్థా ప్రముక్ కమఠం రమేష్, జిల్లా సహకార్యవాహ కటకం లక్ష్మణ్ మాట్లాడుతూ 1925 విజయదశమి రోజున మహారాష్ట్ర నాగపూర్ లో డాక్టర్ కేశవరావు బలీరాం హెగ్డే వార్ ప్రారంభించిన ఆర్‌ఎస్‌ఎస్ నేడు ప్రపంచవ్యాప్తం అయిందన్నారు.
నిత్య శాఖ శాఖలలో శారీరక పట్టుత్వ, దేశహిత కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. ఏడాది పాటు శతాబ్ది ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. స్వయం సేవకుల రూట్ మార్చ్ ఆకట్టుకుంది. ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సంఘచాలక్ బాదం ప్రకాష్, పట్టణ కార్యవాహ ఎమికే శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.