20-10-2025 01:08:16 AM
చేవెళ్ల, అక్టోబర్ 19: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు (ఆర్‌ఎస్సెస్) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా చేవెళ్ల పట్టణంలో స్వయంసేవకుల పథ్ సంచలన్ (కవాతు) వైభవంగా జరిగింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు రచ్చబండ హనుమాన్ ఆలయం నుండి ప్రారంభమైన కవాతు ప్రధాన రోడ్ల మీదుగా వివేకానంద కాలేజీ వరకు కొనసాగింది. తెల్ల చొక్కాలు, గోధుమ రంగు ప్యాంట్లు ధరించిన స్వయంసేవకులు క్రమశిక్షణతో కవాతు చేశారు.
పట్టణ ప్రజలు రోడ్ల వెంబడి నిలబడి వీరిని అభినందించారు. శతాబ్ది ఉత్సవాల భాగంగా సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు పాండు రంగారెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు పత్తి సత్యనారాయణ, సంఘం స్వయం సేవకులు పాల్గొన్నారు.