calender_icon.png 20 October, 2025 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టార్మ్ వాటర్ డ్రైన్ లైన్ పనుల పరిశీలన

20-10-2025 01:09:29 AM

ఎల్బీనగర్, అక్టోబర్ 19 : మన్సూరాబాద్ డివిజన్‌లోని బెతస్థ కాలనీ, మన్సూరాబాద్ చిన్న చెరువు పరిసర ప్రాంతాల్లో రూ. 53.00 లక్షల వ్యయంతో జరుగుతున్న స్టార్మ్ వాటర్ డ్రైన్ లైన్ పనులను ఆదివారం కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి స్థానికులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ.. గతంలో మన్సూరాబాద్ చిన్న చెరువులోకి వర్షపు నీరు వచ్చే దారులన్నీ మూసుకుపోవడంతో వర్షపు నీరు నిల్వ కాక భూగర్భ జలాలు తగ్గిపోయాయన్నారు.

దీంతో ప్రశాంత్ నగర్, సెంట్రల్ బ్యాంక్ కాలనీ, చంద్రపురి కాలనీ, ఆదిత్య నగర్, భవాని నగర్, మధురా నగర్, వినాయక్ నగర్, మన్సూరాబాద్ ఓల్డ్ విలేజ్, కాస్మోపాలిటన్ కాలనీ, సాయిసప్తగిరి, లక్ష్మీ నగర్, రాక్ టౌన్, సూర్యోదయ కాలనీ మొదలైన అనేక ప్రాంతాల్లో బోర్లు ఎండిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.

మన్సూరాబాద్ చిన్న చెరువులో వర్షపు నీటిని స్టోరేజ్ చేయాలనే కాన్సెప్ట్ తో స్టార్మ్ వాటర్ డ్రైన్ పనులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానికులు నాంపల్లి కృష్ణ, పృధ్విరాజ్, ప్రవీణ్ రెడ్డి, సుధాకర్, సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.