30-10-2025 07:02:33 PM
ఐసిడిఎస్ సిడిపివో ఆస్త్ర అంజుమ్..
నకిరేకల్ (విజయక్రాంతి): శిశువిక్రయాలు చట్ట విరుద్ధమని దత్తత పేరుతో ఎవరైనా శిశువిక్రయాలు జరిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఐసిడిఎస్ సిడిపిఓ అస్రా అంజుం పేర్కొన్నారు. గురువారం మండలంలోని నకిరేకల్, నోముల, మండలాపురం గ్రామాలలో వివిధ ఇండ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎవరికైనా దత్తత కావాలంటే కారా వెబ్సైట్ నుండి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అనంతరం ఇద్దరు ఆడపిల్లల తల్లి, బాలింత గృహ సందర్శనకు వెళ్లి శిశువిక్రయాలు, అక్రమ రవాణా, బాల్య వివాహాల గురించి అవగాహన కల్పించారు. ఆమె వెంట ఐసిడిఎస్ సూపర్వైజర్లు సునీత, భవాని, అంగన్వాడి టీచర్లు పి. నాగమణి, కవిత పాల్గొన్నారు.