07-08-2025 12:05:43 AM
అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన
అబ్దుల్లాపూర్‌మెట్, ఆగస్టు 06: గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి చెందిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామానికి చెందిన నిమ్మల బాల్‌రాజ్ గౌడ్ (54) ఆర్టీసీ కండక్టర్. బాల్‌రాజ్ హయత్‌నగర్ డిపో2 కండక్టర్‌గా (ఈ216643) విధులు నిర్వహిస్తున్నాడు.
తన విధి నిర్వహణలో భాగంగా హయత్‌నగర్ డిపో2లో బస్సు నెంబర్ టీఎస్07యూజీ6240 మంగళవారం మధ్యాహ్నం 3:30 బాల్‌రాజ్ డ్యూటీకి హాజరయ్యారు. నైట్ హౌట్‌లో భాగంగా అబ్దుల్లాపూర్‌మెట్ మండల జెఎన్‌ఎన్‌ఆర్‌ఏఎం కాలనీ చేరుకున్నారు. రాత్రి భోజనం చేసి నిద్రించే సమయంలో ఉన్నట్టుండి 10.45 సమయంలో బాల్‌రాజ్ ఛాతీలో నొప్పి వస్తుందని.. డ్రైవర్ ఉపేందర్‌కు తెలియజేశాడు.
ఉపేందర్ వెంటనే 108కు సమాచారం ఇవ్వగా.. వారు సంఘటన స్థలానికి చేరుకుని పరీక్షించగా ఆర్టీసీ కండక్టర్ బాల్‌రాజ్ అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు 108 సిబ్బంది వారు తెలిపారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్‌స్పెక్టర్ వి. అశోక్‌రెడ్డి తెలిపారు.