calender_icon.png 8 August, 2025 | 12:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేర్వేరుగా ఇద్దరు వ్యక్తుల అదృశ్యం

07-08-2025 12:06:48 AM

జహీరాబాద్, ఆగస్టు 6 : జహీరాబాద్ పట్టణంలో వేర్వేరు చోట్ల ఇద్దరు వ్యక్తులు అదృశ్యమైనట్లు టౌన్ ఎస్.ఐ వినయ్కుమార్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. అల్లిపూర్ గ్రామానికి చెందిన షేక్ మోహిజ్ అనే వ్యక్తి  ఈనెల 5న ఇంటి నుండి బయటకు వెళ్లి వస్తానని చెప్పి రాలేదని, బంధువుల వద్ద వెతికినా ఆచూకి లభించలేదని తెలిపారు. ఆయన భార్య యాస్మిన్ బేగం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

అలాగే జహీరాబాద్ పట్టణంలోని మాణిక్ ప్రభు వీధికి చెందిన గోవిందుపూర్ కృష్ణ అదృష్టమైనట్లు తెలిపారు. కృష్ణ మూడు సంవత్సరాల క్రితం  ఆయన భార్య సంగీతతో మనస్పర్ధలు రావడంతో తన పుట్టింటికి వెళ్ళిపోయింది. భార్య వెళ్లిన తర్వాత కృష్ణ తన అన్న గోవింద్ పూర్ వెంకట్ వద్ద ఉంటున్నారు. గత నెల 14న ఇంటి నుంచి వెళ్లిపోయిన కృష్ణ తిరిగి రాకపోవడంతో  పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు