calender_icon.png 8 August, 2025 | 12:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు

07-08-2025 10:03:52 PM

గజ్వేల్: ములుగు మండలం వంటిమామిడి పెట్రోల్ బంక్ వద్ద గురువారం మధ్యాహ్నం టాటాఏసీ వాహనంలో గోవులను అక్రమంగా తరలిస్తుండగా జిల్లా బీజేపీ నాయకుడు పల్లె రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. సదరు వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు ద్విచక్రవాహనాలతో వెంబడించి వాహనాన్ని పట్టుకున్నారు. వాహనంలో 13 ఆవులు ఉండటంతో పోలీసులకు బీజేపీ కార్యకర్తలు సమాచారం అందించారు. 13 ఆవులను రాజేపేట గోశాలకు తరలించారు. అక్రమంగా తరలిస్తున్న గోవులను పట్టుకున్న వారిలో మహేష్, నవీన్, రాజు, శ్రీకాంత్, శ్రీను తదితరులున్నారు.