calender_icon.png 8 August, 2025 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఉద్యమిస్తాం

07-08-2025 10:01:33 PM

టి. జి. ఈ. జేఏసి చైర్మన్ నరాల వెంకట్ రెడ్డి...

కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): ఉద్యోగుల హక్కుల సాధన కోసం రాష్ట్ర టీజీ ఈ జేఏసీ పిలుపుమేరకు ఉద్యమిస్తామని టిజి ఈ జేఏసీ కామారెడ్డి జిల్లా చైర్మన్ నరాల వెంకటరెడ్డి(TGI JAC District Chairman Nara Venkata Reddy) అన్నారు. గురువారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం గత 18 నెలలుగా ఎదురుచూస్తూ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. అనేక పర్యాయాలు  మంత్రుల కమిటీ సభ్యులతో, IAS ల కమిటికి గౌరవ రాష్ట్ర ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రితో, మంత్రివర్గ ఉప సంఘంతో, అధికారుల కమిటీతో చర్చలు జరిపినప్పటికీ ఏ ఒక్క సమస్య ఇప్పటివరకు పరిష్కారానికి నోచుకోలేదు అన్నారు.

ముఖ్య మంత్రి, మంత్రులు స్పష్టమైన హామీలు ఇచ్చినప్పటికీ ఉద్యోగుల సమస్యలు ఇంకా పెండింగ్లో ఉండడం శోచనీయమని TGEJAC కామారెడ్డి జిల్లా చైర్మన్ నరాల వెంకట్ రెడ్డి అన్నారు. కామారెడ్డి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం  భవన్  లో ఏర్పాటు చేసిన  టిజిఇజేఏసీ ప్రత్యక్ష సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన  సమావేశంలో తెలిపారు. ముఖ్యమంత్రి  ఆదేశాల ప్రకారం ఉద్యోగస్తుల పెండింగ్ బిల్లులు, ప్రతి నెలకు 700 కోట్లు, ఉద్యోగ లోకానికి చెల్లిస్తామని చెప్పినప్పటికీ నేటికి కార్యరూపం దాల్చలేదన్నారు. 

2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 57 మెమో ద్వారా పాత పెన్షన్ అమలు చేయాలి, కానీ నేటికీ  కార్యరూపం దాల్చలేదు, ఇటీవల హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎంప్లాయిస్ TGEJAC జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి Dr దేవేందర్, అడిషనల్ జనరల్ సెక్రటరీ అల్లాపుర్ కుశాల్, నిట్టు విట్టల్ రావు, నీలం లింగం, CH లింగం, హన్మంత్ రెడ్డి, ఎల్లారెడ్డి, బట్టు రాజు, ఎం నాగరాజు, సాయిరెడ్డి, దేవరాజు, అంబిర్ మనోహర్, లక్ష్మిరాజ్యం, నిజాం, మఖ్బుల్, శ్రీమతి మహమ్మదీ సుల్తానా, మల్లేశం , S మోహన్ , విశ్వనాథం , తదితరులు పాల్గొన్నారు.