calender_icon.png 7 August, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘తహసీల్’ ఆఫీస్‌లో లంచావతారులు

07-08-2025 12:04:18 AM

-చిరుద్యోగి నుంచి ఇంచార్జి తహసీల్దార్ వరకు పైసా లేనిదే కదలని ఫైల్

-ముడుపులు అందజేస్తే చకచకా పనులు

-ప్రైవేట్ వ్యక్తులతో వసూళ్లు

-దళారులు, పైరవీకారులకు పెద్దపీట

నాగార్జునసాగర్, ఆగస్టు 6: అనుముల  మండల తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతుంది అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా తహసీల్దార్ కార్యాలయం నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ప్రధాన మైన రెవెన్యూ శాఖలో అవినీతి మరీ మితిమీరిందని, అవినీతికి కేరాఫ్గా తహసీల్ కార్యాలయాలు మారాయని రైతులు ఆరోపిస్తున్నారు. ముడుపులు అందజేస్తే ఏదైనా సాధ్యం అన్న తరహాలో పనులు జరుగుతాయంటున్నారు.

ఇందుకు ప్రత్యక్ష ఉదాహ రణలు ఇటీవల అనుముల  మండల తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన సంఘటన లను చెప్పుకోవచ్చు. మండల కేంద్రాల్లో ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకొని మరీ రెవెన్యూ అధికారులు దందాలు నడిపిస్తున్నారని బాధితులు పేర్కొంటున్నారు. కార్యాలయాల్లో పైరవీకారులు చెప్పిందే వేదం. భూముల విషయంలో స్థానికంగా ఉన్న కంప్యూటర్ ఆపరేటర్లు కీలకంగా మారారు. సామాన్యులను పీడించుకుతింటున్నారు. 

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని అనుముల రెవెన్యూ అధికారుల అవినీతి రోజురోజుకూ మితిమీరుతున్నది. రెవెన్యూ అధికారులు ఇటీవల కాలంలో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సామాన్యులు, రైతులు తహసీల్ కార్యాలయానికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. దళారులను, పైరవీకారులను కలిసాకే తహసీల్ కార్యాలయాల్లోకి అడుగుపెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. పనికో రేటు నిర్ణయించి దళారులు చెప్పిన విధంగా ఇస్తేనే పనులు సాఫీగా జరుగుతున్నాయి. లేదంటే రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. 

పాలన ఇంకెన్నాళ్లు?

అనుముల మండలంలో ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారింది. ప్రధాన కార్యాలయాల్లోని కీలక పోస్టుల్లో ఇనచార్జి అధికారులే నెట్టుకొస్తున్నారు. ఈపరిస్థితుల్లో ప్రజలకు ప్రభుత్వ సేవలు నా మమాత్రంగా అందుతున్నాయి. మరోవైపు మండల అభివృద్ధి కుంటుపడుతోంది. కీలకమైన తహసీల్దార్ కార్యాలయానికి రెగ్యులర్ తహసీల్దార్ లేరు అనుముల మండలం తాసిల్దారుగా వై. రఘు, ఇన్చార్జిగా ఉన్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన వజ్రాల జయశ్రీ హుజూర్నగర్ లో జరిగిన భూ కేటాయింపులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై జైలుకు వెళ్ళింది. దీంతో ఆమె విధులనుంచి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత అక్కడే పనిచేస్తున్న డిప్యూటీ తాసిల్దార్ రఘుకు ఇన్చార్జి తహసిల్దార్ బాధ్యతలను ఉపయోగించారు. ఇలా ఏడాదిపైగా ఇక్కడ డిప్యూటీ తాసిల్దార్ ఇన్చార్జిత సిల్వర్ గా పని చేస్తున్నాడు. ఇలా పలు  మండలాల్లో ఇన్చార్జి తాసిల్దార్  పనిచేస్తున్నారు. రెగ్యులర్  తాసిల్దార్ నియమించాలని ప్రజలు కోరుకుంటున్నారు

పైసా లేనిది పని కాదు ..

ఏ పని కావాలన్నా పైరవీకారులు చెప్పాలి. పైసా లేనిది పని కాదు.. చిన్నస్థాయి ఉద్యోగి నుంచి ఇంచార్జ్ తహసీల్దార్ వరకు అంతా వసూళ్లే& అనుముల తాసిల్దార్  కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులదే పెత్తనం.. ఆఫీసుకు సంబంధం లేని వారిని ఏర్పాటు చేసుకొని మామూళ్లు తీసుకొని వారికి కావాల్సిన ఫైల్ను చక్కబెడుతున్నారు. ప్రతి చిన్న విషయానికీ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారు. స్లాట్ బుక్ చేస్తే కూడా డబ్బులు తీసుకోనిది రిజిస్ట్రేషన్ చేయడం లేదన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజు చెల్లించినప్పటికీ ఆదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.

భూముల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాక భూమి విలువ నుబట్టి తహసీల్ కార్యాలయంలోని బ్రోకర్లు ముంకుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ పని పూర్తి అయితేనే అక్కడ రిజిస్ట్రేషన్ అవుతుంది. లేకపోతే ఏదో రకంగా కొర్రీలు పెట్టి ఆపేస్తున్నారు. పెద్ద రైతులు ఎంత లేదన్న రైతుల నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇవిగాకుండా డాక్యూమెంట్కు ఒక్కదానికి రూ.1,000 నుంచి రెండు వేల వరకు వసులు చేస్తున్నారు. బాధితులు ఆరోపిస్తున్నారు. వేలల్లో జీతాలు తీసుకునే ఉద్యోగులు ఇలా బరితెగించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివిధ సమస్యలపై రైతులు, ప్రజలు నేరుగా వెళ్తే ఫైళ్లు ముందుకు కదలడం లేదు. పని కావాలంటే ఎవరో ఒకరు మధ్యవర్తిగా వెళ్లి చేయించక తప్పని పరిస్థితులు ఉన్నాయి. భూముల రేట్లు పెరిగిపోవడం భూ రికార్డుల్లో సవరణలు, ఇతర భూసంబంధమైన పనులు సకాలంలో జరగక రైతులు, భూ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

తహసీల్’లో పైరవీకారులదే పైచేయి

సాగర్ నియోజకవర్గం అనుముల మండలం తహసీల్ కార్యాలయంలో డబ్బులు ముట్టనిదే ఏపని కావడం లేదు. భూ సమస్యలపై రైతులు తహసీల్ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా పనులు కావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. తహసీల్ కార్యాలయంలో పైరవీకారులను ఆశ్రయిస్తేనే పనులు జరిగిపోతున్నాయి. పైరవీకారులు సమస్యను బట్టి డబ్బులు తీసుకొని అధికారులతో పనులు చేయిస్తున్నారు. నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా రూ.30 నుంచి రూ.40 లక్షలకు ఎకరా భూమి ధర పలుకుతున్నది. అనేక గ్రామాలలో భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. భూ సమస్యల పరిష్కారం కోసం తహసీల్ కార్యాలయాల్లో చేతులు తడపనిదే పనులు కావడం లేదని రైతులు వాపోతున్నారు.