08-08-2025 01:52:10 AM
మహబూబ్ నగర్ ఆగస్టు 7 (విజయ క్రాంతి) : తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పాత పాలమూరు అర్బన్ హెల్త్ సెంటర్ లో తల్లి పాల వారోత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. శిశువు ఆరోగ్యానికి తల్లి పాలు ఎంతో శ్రేష్ఠమని అన్నారు.ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం అప్పుడే పుట్టిన శిశువు కు కేవలం 40 శాతం తల్లులు మాత్రమే తల్లి పాలు ఇవ్వడం జరుగుతుందని, ఇది తీవ్రమైన విషయంగా భావించాలి అన్నారు.
బిడ్డ పుట్టిన గంటలోపే తల్లి పాలు పట్టాలని, తల్లి పాలే శిశువులకు మొదటి ఆరు నెలల వరకు ఉత్తమమైన ఆహారమని, 50 శాతం మంది తల్లులు మొదటి ఆరు నెలలు తల్లి పాలు ఇవ్వడం లేదని తెలిపారు. తల్లి - బిడ్డ ఆరోగ్యానికి కానీసం 6 నెలల వరకు కేవలం తల్లి పాలు పట్టాలన్నారు. అనంతరం పాత పాలమూరు లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ముగ్గు పోసుకున్న లబ్ధిదారు చిత్ర తో మాట్లాడి ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమం లో ఈ కార్యక్రమం లో నర్సింగ్ విద్యార్థినిలు,తల్లులు, అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ తదితరులు ఉన్నారు.